
పుణె కంటోన్మెంట్ నియోజక వర్గం బాలాజీ నగర్ సభలో జనసేన అధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు
పుణె కంటోన్మెంట్ నియోజక వర్గం బాలాజీ నగర్ సభలో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ప్రసంగించారు.
ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు
* ఏ ప్రాంతమైన దేశమైనా ముందుకు సాగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం అవసరం. సుస్థిరతకు చాలా శక్తి ఉంటుంది. అది అపరిమితమైన అభివృద్ధిని అందజేయడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.
* దశాబ్ద కాలంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో గాని అభివృద్ధిలో గానీ ముందుకు దూసుకు వెళ్తుంది. దీనిని కొనసాగించే మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి.
* మహారాష్ట్ర ప్రజలను కలిపి ఉంచి ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లే మహాయుతి కూటమికి ప్రజలు మద్దతు తెలపాలి. కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి పాలించాలి అనుకుంటున్న వారికి బుద్ధి చెప్పాలి.
* చాయ్ వాలాగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని దేశం కోసం నిరంతరం ఆలోచించే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వ పటంలో ప్రత్యేకంగా నిలిపారు. ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ అందించిన పోరాట స్ఫూర్తితో మరాఠా ప్రజలు మరోసారి ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలి.
* రహదారులు, అభివృద్ధి, సంక్షేమం, దేశభద్రత, ఆర్థిక వృద్ధితో భారతదేశాన్ని సరికొత్తగా ముందుకు తీసుకు వెళుతున్న శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మహారాష్ట్రలో మహాయుతి స్ఫూర్తిని ఐక్యంగా కొనసాగిస్తేనే మహారాష్ట్ర వికాసానికి దోహదపడుతుంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర చాలా కీలకమైంది. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దీనికి తోడ్పాటునిస్తుంది.
Be the first to comment