
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ
అమరావతి :
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఏపిఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.
ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్
సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా
చూపించవచ్చని APSRTC తెలిపింది.
Be the first to comment