
పిఠాపురం హైవే రోడ్డులో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
పిఠాపురం హైవే రోడ్డులో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైవే రోడ్డులో ఆగి ఉన్న మార్కెట్ లారీని క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో క్వారీ లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయి కేబిన్ లోంచి మంటలు ఎగసి పడ్డాయి. డ్రైవర్ కేబిన్ మధ్యలో చిక్కుకుని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పోవడంతో డ్రైవర్ ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. ఆ సమయంలో డ్రైవర్ ఆర్తనాదాలు, ఆయన పడుతున్న బాధ చుట్టు పక్కల వారిని కలచి వేసింది. వాహనం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో క్వారీ లారీ డ్రైవర్ కు కను రెప్ప మూతపడతో ఈ ప్రమాదం జరిగినట్టు డ్రైవర్లు చెబుతున్నారు. మార్కెట్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక పోవడం వల్ల మంటల్లో కాలిపోతున్న డ్రైవర్ ను రక్షించడం కుదరలేదు. కళ్లెదుటే ఆ డ్రైవర్ సజీవ దహనమైన తీరు గగుర్పాటుకు గురిచేసింది. హైవే రోడ్డులో ఆగి ఉన్న మార్కెట్ లారీని క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో క్వారీ లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయి కేబిన్ లోంచి మంటలు ఎగసి పడ్డాయి. డ్రైవర్ కేబిన్ మధ్యలో చిక్కుకుని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక పోవడంతో డ్రైవర్ ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. ఆ సమయంలో డ్రైవర్ ఆర్తనాదాలు, ఆయన పడుతున్న బాధ చుట్టు పక్కల వారిని కలచి వేసింది. వాహనం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో క్వారీ లారీ డ్రైవర్ కు కను రెప్ప మూతపడతో ఈ ప్రమాదం జరిగినట్టు డ్రైవర్లు చెబుతున్నారు. మార్కెట్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక పోవడం వల్ల మంటల్లో కాలిపోతున్న డ్రైవర్ ను రక్షించడం కుదరలేదు. కళ్లెదుటే ఆ డ్రైవర్ సజీవ దహనమైన తీరు గగుర్పాటుకు గురిచేసింది
Be the first to comment