
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా బేతపూడి విజయ్ శేఖర్
మంగళగిరి మండలం బేతపూడి బాపూజీ నగర్ కు చెందిన జనసేన రాష్ట్ర కార్యదర్శి & జనసేన తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బేతపూడి విజయ్ శేఖర్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
గురువారం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది.
మంగళగిరి నియోజకవర్గం లో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి విజయ శేఖర్ క్రియాశీలకంగా పని చేశారు.
2020 లో మంగళగిరి నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధిగా పనిచేశారు.
మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సహకారంతో రాష్ట్ర కార్యదర్శి గా ముందుకు వెళ్ళారు.
2023లో తాడికొండ పార్టీ సమన్వయకర్త నియమితు లయ్యారు.
2024 ఎన్నికలలో మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో కూటమి గెలుపుకు విశేషంగా కృషి చేశారు.
విజయ శేఖర్ శ్రమను గుర్తించిన అధిష్టానం తగిన ప్రాధాన్యత కల్పించింది.
ఈ సందర్భంగా విజయ శేఖర్ మాట్లాడుతూ తనకు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఏపీఏంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Be the first to comment