
ప్రతి గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర రావు
గూడూరు మండలం కాండ్ర గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ
గ్రామస్థాయిలో జనసేన పార్టీనిబలోపేతం చేసేందుకు ప్రతి జనసైనికుడు సైనికుల్లా పనిచేయాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు.గూడూరు మండలం కాండ్ర గ్రామంలో జనసేన నాయకులు నవీన్ రాజు ఆధ్వర్యంలో శనివారం జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టసమయాల్లో పార్టీకి తోడు ఉంటూ పవన్ కళ్యాణ్ వెన్నంటి నడచిన జనసైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన ఆవిర్భావం నుంచి గ్రామస్థాయిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలో పార్టీ సిద్ధాంతాలను మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలను అన్ని గ్రామాల్లో తీసుకువెల్లి పార్టీని బలోపేతం చేయాలని అలాగే డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ తెలియచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని జనసేన నాయకులు మాట్లాడుతూ మేము కష్టపడి రాబోయే పంచాయతీ ఎలక్షన్లో బలంగా నిలబడతామని కూటమి పార్టీలను కలుపుకొని పార్టీని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జగదీష్, దిలీప్, కిరణ్, మోహన్, కృష్ణ, చరణ్ , హరీష్, దుష్యంత్, జస్వంత్, నరేంద్ర, సాయి, పవన్, దామోదర్, మల్లికార్జున, మస్తాన్, సుభాన, అఖిల్ , బాలు, రోహిత్, సంతోష్, నరేంద్ర, ప్రసన్నకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment