
కార్తీక పౌర్ణమి — అరటి దొప్పల దీపాలు
కార్తిక పౌర్ణమి రోజు దీపాలు దూరంగా వెళ్లిపోవాలి. దీపాలను అరటి దోప్పలలో పెట్టి నీటిలో విడిచి పెడతారు. అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతున్న దీపాలను చూస్తూ కొద్ది సేపు ఉండాలి. ఆ తర్వాతే ఇంటికి రావాలి. మన పెద్దలు ఈ నిబంధన విధించటానికి ఒక కారణముంది. నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి. అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది. ఇదే విధంగా మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు. దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపపేసినట్లు దీపాన్ని చూస్తూ భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన మనందరినీ తనలో కలుపుకుంటాడనే పారమార్ధికమైన భావనతో దీపాన్ని చూడమంటారు. అరటి దోప్పల్లోనే దీపాలను పెట్టడం వెనక మరొక పరమార్థం కూడా ఉంది. దీపం అరటిదోప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవునెయ్యి అంతా ఆవిరై పోతుంది. నెయ్యి ఆవిరి కావటంతో కొద్ది సేపటికి దొప్ప తిరగబడి నీటిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన దోప్పాలను నీటిలోని చేపలు తింటాయి. అంటే దీపాలు విడిచిపెట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగదు.
– చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం
Be the first to comment