
శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాల బహుకరణ
ఇటీవల సంభవించిన వరదల సమయంలో తమ వార్డు నుంచి విజయవాడ వెళ్లి విశేష సేవలందించిన శానిటేషన్ సిబ్బందికి 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు మంగళవారం నూతన వస్త్రాలు అందజేశారు. స్థానిక ఎకెసి కాలనీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాగంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరోరక్షించేందుకు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేసే శానిటేషన్ సిబ్బంది సేవలను ఎంత కీర్తించినా తక్కువేనని అన్నారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదల నేపద్యంలో అక్కడి వరద బీభత్సం కారణంగా ఏర్పడిన వ్యర్థాలను తొలగించి అక్కడి ప్రజల జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొని రావటానికి విశాఖ నుంచి వెళ్లిన సిబ్బంది ఎంతో శ్రమించారని అన్నారు. వారి సేవలకు సత్కారంగా జివిఎంసి నిధులతో ఒక్కొక్కరికి రెండు జతల బట్టలను అందజేశామని అందులో భాగంగా తమ వార్డు నుంచి వెళ్లిన కార్మికులను కూడా గౌరవంగా సత్కరించటం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో శానీటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, సచివాలయం శానీటేషన్ సెక్రెటరీ సత్తిబాబు గారు, సూపర్వైజర్లు శ్రీను, కొండబాబు శానీటేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Be the first to comment