
ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు
AP: రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు శుభవార్త తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు/పట్టాలు అందించనున్నట్టు ప్రకటించింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగర్’ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇది వరకే పురోగతిలో ఉన్న గృహాలు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.4,012 కోట్లు కేటాయించింది.
Be the first to comment