
జనసేన నాయకులు భట్టు పండు కు రోడ్డు ప్రమాదం
అపస్మారక స్థితిలో
అమలాపురం రూరల్ జనసేన నాయకులు, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టు పండుకు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పడి పూజ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయం లో రాత్రి 11.30 నిముషాలు ప్రాంతంలో ప్రమాదం జరిగింది. స్నేహితుని మోటార్ సైకిల్ పై వస్తుండగా పండు వెనుక కూర్చున్నారు. మోటార్ సైకిల్ నడుపుతున్న స్నేహితునికి నిద్ర ముంచుకు రావడంతో బండారులంక సమీపంలో ఒక రాళ్లగుట్టలోకి మోటారు సైకిల్ దూసుకుపోయింది. వెహికల్ నడుపుతున్న స్నేహితునికి స్వల్ప గాయాలు కాగా, పండు రాళ్ళల్లోకి దూసుకు పోవడంతో తలకు బలమైన గాయాలు తగిలి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బట్టుపండు మృతి
Be the first to comment