ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్‌.. ప్రపంచం కంటే ముందుంది. బోస్టన్‌ కన్‌సల్టింగ్‌ గ్రూప్‌ (BCG) తాజా పరిశోధన ప్రకారం.. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగిస్తూ విలువను పెంచుతున్నాయి.
బీసీజీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నాయి. ఫిన్‌టెక్, సాఫ్ట్‌వేర్ బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కొన్నేళ్ల పెట్టుబడి, నియామకం, పైలట్‌ ప్రాజెక్ట్‌ల తర్వాత ఇప్పుడు సీఈవోలు ఈ సాంకేతికత నుండి స్పష్టమైన రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దాని పూర్తి విలువను పొందడం కష్టంగా ఉందని వివరించింది.

పరిశ్రమల అంతటా ఏఐ ప్రోగ్రామ్‌లు విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ, బీసీజీ తాజా పరిశోధన ప్రకారం, కేవలం 26 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా కాన్సెప్ట్‌ను దాటి ముందుకు వెళ్లడానికి, స్పష్టమైన విలువను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి.

ఆసియా, యూరప్ ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన పది ప్రధాన పరిశ్రమలలో 1,000 మంది చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా బీసీజీ ఈ నివేదికను రూపొందించింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*