
తాళ్లూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ.
బూర్గంపాడు మండలం ఇరవెండి లో తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, నీలిమ దంపతుల సౌజన్యంతో బుధవారం 12 సైకిళ్ళు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమశ్రీ కి ఈ సైకిల్లను అందజేశారు. పాఠశాలలకు వచ్చే బాలికలకు ఇబ్బందులు లేకుండా సైకిల్లు అందించినట్లు ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, విజయ రేణుక, జగన్మోహన్, వనమా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment