
కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మైనర్ విద్యార్థి మైధిలి కుటుంబ సభ్యుల కన్నీటి కథ
ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మైనర్ విద్యార్థి మైధిలి కుటుంబ సభ్యుల కన్నీటి కథ
మైధిలి మరణం కేసులో లారీ డ్రైవర్ తో పాటు, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, కుంచాల కృపాకర్ లఫై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సోమవారం రోజు మైనర్ విద్యార్థి మైధిలి తల్లిదండ్రులతో కలిసి న్యాయం కోసం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంకి వెళ్లి ఫిర్యాదు చేశారు. మైధిలి మరణానికి రోడ్డు ప్రమాదం ఒక్కటే కారణం కాదని, మైధిలి వినుకొండలో టోర్నమెంట్ ముగించుకొని కావలి శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించే వరకు చోటు చేసుకున్న ప్రతిఘటన కూడా కారణమేనన్నారు. మైనర్ విద్యార్థి మైధిలి మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుందని కనపర్తి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. జనసేన జనవాణి కార్యక్రమంలో మైధిలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని తెలియజేశారు, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, మరియు మైనర్ విద్యార్థి మైధిలికి మాయమాటలు చెప్పి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో దారి మళ్లించి వెంట తీసుకువెళ్లిన కుంచాల కృపాకర్ లను నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి అని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.
Be the first to comment