
సత్యదేవుని సన్నిధిలో అన్నపూర్ణాదేవికి అవమానం..
దేవస్థానానికి వచ్చిన భక్తులచే అన్న ప్రసాదాన్ని తొక్కిస్తున్న సూపర్డెంట్ రామకృష్ణ…
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి విచ్చేసినటువంటి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే అన్న ప్రసాదాన్ని అత్యంత హీనంగా నిర్వహిస్తున్నటువంటి వైనం సత్యదేవుని సన్నిధిలో ఆదివారం చోటుచేసుకుంది.అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా కొలిచేటువంటి హిందువుల మనోభావాలను సత్యదేవుని ఆలయ ఈవో సంబంధిత సూపర్డెంట్ అవమానపరుస్తున్నారని సత్యదేవుని సన్నిధికి విచ్చేసినటువంటి భక్తులు వాపోతున్నారు.సంబంధిత కాంట్రాక్టర్ పై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై సంబంధిత సూపర్డెంట్ పై చర్యలు తీసుకుని తీసుకోవాలని కోరుతున్నారు.
Be the first to comment