
వన భోజన మహోత్సవంలో పాల్గొన్న శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం నందు ఉన్న మన్నూరు గ్రామంలో నాగలకట్ట దగ్గర ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా కార్తీకమాసంలో “వనభోజన మహోత్సవం” నిర్వహిస్తారు. అదే విధంగా ఈ రోజు మన్నూరు గ్రామ ప్రజలు మరియు నాగలకట్ట సేవా సమితి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త “శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు” గారు పాల్గొని ముందుగా నాగలకట్ట దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు మరియు గ్రామ ప్రజలు , మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to comment