కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్ ఆరుగురి గల్లంతు

కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్ ఆరుగురి గల్లంతు

 

డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన

త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ మధ్య కూలినట్టు నిర్ధారణ

హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం

ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ మార్గమధ్యంలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ ప్రాంతాల మధ్య అదృశ్యమైంది. ఆ తర్వాత కొంత సేపటికే అది కూలిపోయినట్టు నిర్ధారణ అయిందని ఉత్తరాఖండ్ శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) డాక్టర్ వి. మురుగేశన్ వెల్లడించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఆయన ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం, భౌగోళిక పరిస్థితుల నడుమ ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమా దానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*