
మంగ్లీ పాటకు కన్నీటిపర్యంతమైన గద్దర్ సతీమణి
తెలంగాణ : గద్దర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకల సందర్భంగా ‘బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి’ అనే పాటను ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించారు. మంగ్లీ పాట పాడుతుంటే ప్రజా యుద్ధనౌక, దివంగత గద్దర్ సతీమణి విమల కన్నీటి పర్యంతమయ్యారు. విప్లవ రచయిత బండి యాదగిరి రాసిన ఈ పాటను మా భూమి సినిమాలో గద్దర్ పాడిన సంగతి తెలిసిందే.
Be the first to comment