
ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు శ్రీ మురళీ నాయక్. శ్రీ సత్యసాయి జిల్లా చెందిన శ్రీ మురళీ నాయక్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శనివారం ఉదయం శ్రీ మురళీ నాయక్ తల్లితండ్రులకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపించిన రూ. 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ కల్లి తండాకు వెళ్ళి అందచేశారు. ఈ కార్యక్రమంలో అహుడ ఛైర్మన్ శ్రీ టి.సి.వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి, జనసేన పార్టీ నేతలు శ్రీ పత్తి చంద్రశేఖర్, శ్రీ కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment