
ఆలస్యమే ఆమెను కాపాడింది
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తరుణంలో 10 నిమిషాల ఆలస్యం.. ఓ యువతి ప్రాణాలను కాపాడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యం కావ డంతో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది భూమి చౌహాన్ అనే మహిళ. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్ AI171ను బుక్ చేసుకుంది
అయితే ఎయిర్ పోర్ట్ కు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పది నిమిషాలు ఆలస్యం అయింది. అప్పటికే టేకాఫ్ అయ్యి ఫ్లైట్ కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటన తనను ఒళ్లు గగు ర్పొడిచేలా చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది భూమి చౌహాన్.
తనను వినాయకుడే కాపాడాడు అని పేర్కొంది. విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న భూమి చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ వల్ల నేను పది నిమిషాలు ఆలస్యం అయిపోయాను పది నిమిషాల ముందు ఫ్లైట్ మిస్ అవ్వడం నాకు బాధ అనిపించింది, కానీ ఆలస్యమే నా జీవితాన్ని కాపాడింది అని చెప్పుకొ చ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె సానుభూతి తెలియజేశారు.
Be the first to comment