ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు? ఇదీ పాతకాలం పాట మాత్రమే. ఎటు ఉంటే బాగుపడతారో గ్రహించగలిగేది కేవలం రాజకీయ నాయకుడికే ఎరుక. వైసీపీ అధికారం కోల్పోయింది. అధినేతకు కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అసెంబ్లీలో పీఏపీ కేబనేట్ హోదా దొరకలేదు. అదేమంటే అసెంబ్లీ బహిష్కరించామని మితీమీరిన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీలో అడుగుపెట్టని పార్టీలో అంటకాగితే… మిగిలేది బూడిదే అనే నిజాన్ని గ్రహించిన ఓ మేధో ఎమ్మెల్సీ గ్రహించారు. ఇంటి నుంచి పారిపోయిన బిడ్డ తిరిగి ఇంటి గుమ్మం ముందు వేలాడితో ఆ కొడుకుని ఆ తండ్రి అక్కున చేర్చుకోడా? అనే ఆశతో .. పార్టీలో చేరిన రెండు రోజులకే ఎమ్మెల్సీ పోస్టును కొట్టేసిన జయమంగళ రమణ వైసీపీకి అనూహ్య షాక్ ఇచ్చారు. అదే కైకలూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జయమంగళ వెంకటరమణ శనివారం ప్రకటించారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌ మోసేను రాజుకు పంపించినట్లు తెలిపారు. కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు జగన్‌ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో వెంకటరమణ నేడు ఆ పార్టీకి బైబై చెప్పి తిరిగి సొంత గూటికి చేరుతారని ప్రచారం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*