
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా :
ఏపీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండంలోని ఏఎస్ పేట అడ్డరోడ్డు సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యా యి.
ఈ ఘటనలో మృతి చెందిన వారంతా దినసరి కూలీలుగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ చేసేందుకు కూలీలు ఆటోలో వెళ్తున్నారు.
ఈ సమయంలో కారు వేగంగా ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Be the first to comment