
విశాఖ స్టీల్ ప్లాంట్ భవనం వద్ద టెన్షన్.. టెన్షన్
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్ ముట్టడి చేస్తామని ప్రకటించిన యూనియన్ సభ్యులు
విశాఖపట్నం :ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్1,480 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ భవనం నిరసన వ్యక్తం చేశాయి. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పున:సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ముందస్తుగానే స్టీల్ ప్లాంట్ భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది
Be the first to comment