7వ తరగతి నుండి డిగ్రీ అర్హతతో.. హైకోర్టులో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

7వ తరగతి నుండి డిగ్రీ అర్హతతో.. హైకోర్టులో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎగ్జామినర్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్‌, రికార్డు అసిస్టెంట్‌, ప్రొసెస్‌ సర్వర్, ఆఫీస్‌ సబార్డినెట్‌ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

ఖాళీల వారీగా పోస్టుల వివరాలు..

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టులు: 80

జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులు: 230

టైపిస్ట్‌ పోస్టులు: 162

ఫీల్డ్‌ అసిస్టెంట్ పోస్టులు: 56

ఎగ్జామినర్‌ పోస్టులు: 32

కాపీయిస్ట్‌ పోస్టులు: 193

డ్రైవర్‌(లైట్‌ వెహికిల్‌) పోస్టులు: 28

రికార్డ్‌ అసిస్టెంట్ పోస్టులు: 24

ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు: 164

ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు: 651

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌, 7వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్‌ 2, 2025. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.25,200 నుంచి రూ.80,910 వరకు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుకు రూ.20,000 నుంచి రూ.61,960 వరకు, మిగతా పోస్టులకు రూ.23,380 నుంచి రూ.76,730 వరకు జీతంగా చెల్లిస్తారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*