కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి..

కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి..

ముచ్చర్ల గేటు సమీపంలో ఘటన..

హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో హైదారాబాద్ పాత బస్తీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కడ్తాల్ వైపు మహేంద్ర ఎక్స్యూవి TS 09EH 0362 వాహనంలో వస్తుండగా కందుకూరు మండలం ముచ్చర్ల గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన నయాబ్ ఇంతియాజ్ గా గుర్తించారు. వీరంతా శ్రీశైలం డ్యాం సందర్శనకు వెళ్తున్నట్లు తెలిసింది. మిగతా 5 మంది యువకులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*