పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు?

పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు?

_తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ నైతిక, చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూసుకోవ డం పిల్లల నైతిక బాధ్యత మాత్రమే కాదు,న్యాయప రమైన బాధ్యత కూడా అని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం లో పునరుద్ఘాటించింది_

_తల్లిదండ్రులను కాపాడు కోవడం ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు, సామాజిక,నైతిక బాధ్యత అని,దానిని నెరవేర్చడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది.ఆ బాధ్యతను విస్మరించిన కూతురు, కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిని పొందే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది_

_వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి,వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు ఇచ్చిన మాట తప్పడంతో ఓ కన్న తల్లి కోర్టును ఆశ్రయించింది_

_ఈ కేసును విచారించిన జస్టిస్‌ సి.టి.రవికుమార్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం…ఆ కుమారు డికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసింది.అనంతరం ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది_

_ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల,వృద్ధుల సంరక్షణ,పోషణ చట్టం’ అండగా నిలుస్తుం దంటూ పేర్కొంది_

_ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు… కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని పేర్కొంది.ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి వాళ్లకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టంచేసింది.తద్వారా వృద్ధులైన తల్లి దండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది.మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలంటూ తమపై కన్న కొడుకే నిద్రాక్షి ణ్యంగా దాడి చేస్తున్నా డంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ మహిళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు_

_అతనికి అప్పటికే గిఫ్ట్‌ డీడ్‌గా కొంత ఆస్తిని ఇచ్చామని చెప్పుకొచ్చారు.ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకుంది._

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*