నాలుగేళ్ల పాప ఆరోగ్యానికి ఆర్టిక సాయం చేసిన పల్లా శ్రీనివాసరావు

నాలుగేళ్ల పాప ఆరోగ్యానికి ఆర్టిక సాయం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, సుమాదేవి అనే గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి వితిక ఎఫైబ్రోనియేజన్ ఇన్ నేనియస్ అనే వ్యాధితో బాధపడుతోంది.. పైబ్రోనియేజన్ ఇంజక్షన్ పాపకి నెలలో రెండు సార్లు వేస్తేనే పాప బతుకుతుందని ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.32వేలు అవుతోందని వైద్యులు తెలిపారు. నిరుపేద తల్లిదండ్రులకు అది తలకు మించిన భారమే. అందుకే ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శీరిష ద్వారా ప్రభుత్వాన్ని ఆర్ధికసాయం కోరారు.. ఈ ఫిర్యాదు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి రూ.32,000 ఆర్థిక సహాయమందించి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం నుంచి CMRF – Financial AID సాయం వచ్చే వరకు తన సొంత నిధులతో పాపకు ఇంజక్షన్ కు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*