డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
–సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్

అల్లూరి సీతారామ రాజు జిల్లా, పాడేరు డివిజన్ పరిధిలో చౌకధరల దుకాణాలకు సంబంధించి డీలరు రాజీనామా లేదా మరణము లేదా రేషను కార్డుల సర్దుబాటు వలన క్రొత్తగా ఏర్పడిన డీలర్ ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన 30 ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన డీలర్లను నియమించుటకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడ౦ జరిగిందన్నారు. సదరు డీలర్ల ఎంపిక వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందని, అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పొందుపరచిన నిబంధనలకు లోబడి తమ దరఖాస్తులను సంబంధిత తహశీల్దారు వారి కార్యాలయం నందు గానీ లేదా పాడేరు సబ్ కలక్టరు వారి కార్యాలయం నందు గానీ జనవరి 15వ తేదీ సాయంత్రం గం.5.00ల లోగా నేరుగా అందచేయవలెనని సూచించారు. నోటిఫికేషన్ వివరములు మరియు దరఖాస్తు కావలసిన వారు సంబంధిత తహశీల్దారు వారి కార్యాలయములో లేదా పాడేరు సబ్ కలక్టరు వారి కార్యాలయములో కానీ, కార్యాలయపు పని వేళలలో పొందవచ్చునని వివరించారు.
———–

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*