రాష్ట్రంలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌

రాష్ట్రంలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌

రాష్ట్రంలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆయుష్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి ప్రతా్‌పరావ్‌ జాదవ్‌ తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి, శుభ్రత కలిగి నాణ్యతగా ఉండేలా దేశ వ్యాప్తంగా వంద స్ట్రీట్‌ఫుడ్‌ హబ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన గుర్తుచేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎ్‌ఫఎ్‌సఎ్‌సఏఐ), రాష్ట్ర ఆహారభద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత ప్రమాణాలపై తినుబండారాల చిరువ్యాపారులకు ఆదివారం శిక్షణ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్స్‌ ఆన్‌లైన్‌లో ఉచితంగానే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సౌత్‌ రీజనల్‌ డైరెక్టర్‌ పంచమ్‌, రాష్ట్ర జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*