
సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం మా ఉద్దేశం
సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం మా ఉద్దేశం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ బిఆర్అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటా వినియోగించబోతున్నట్లు చెప్పారు. గ్రామాలవారీ సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల సేకరణ చేపడుతున్నామన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే యోచిస్తున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు.
Be the first to comment