
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టికి కాపు నాయకులు ఘన సన్మానం
విజయనగరం కాపు న్యూస్ ప్రతినిధి
విజయనగరం పార్లమెంట్ సభ్యులు, మాజీ సీనియర్ జర్నలిస్ట్, విద్యావేత్త, నిస్వార్థ రహితుడు, నిగర్వి కలి శెట్టి అప్పలనాయుడు తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఐక్య కాపునాడు వ్యవస్థాపక కన్వీనర్ పబ్బినీడి శ్రీ వెంకటేశ్వరరావు, మరియు కాపు పెద్దలు కలసి శాలువా తో ,మెమెంటో బహూకరించి ఘనంగా సన్మానించారు.సందర్భంగా పబ్బినీడి శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపు జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కాపులు మరింత రాజకీయంగా ఎదగాలంటే రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న మీలాంటి పెద్దలందరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలన్నారు.కాపులంతా ఐక్యంగా ఉండాలని,కాపులు అన్ని రంగాలలోను అభివృద్ధి సాధించాలని,రాజ్యాధికార దిశగా పయనించాలని కోరారు.రాష్ట్రంలో ఇటీవల గెలుపొందిన కాపు ఎమ్మెల్యేలను,ఎంపీలను,ఎమ్మెల్సీలను,కాపు ప్రముఖులను రాజకీయ పార్టీలకు అతీతంగా వారి వద్దకు స్వయంగా వెళ్లి కలిసి సన్మానిస్తున్నట్లు తెలిపారు.నాయకులను సన్మానించడానికి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి,కాపుల కాలం,డబ్బులు వృధా చేసే కన్నా ఇలా చేయటం మంచిదని భావించి ఈ విధంగా చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వై.గోపి,శ్రీ పి.సాయి,శ్రీ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment