
దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా.. తెలిస్తే నివ్వెరపోతారు
దానిమ్మ పండు మాత్రమే కాదు.. చెట్టు ఆకులు కూడా
ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. కడుపునొప్పి, కడుపులో వికారం వంటి సమస్యలను తగ్గించటంలో దానిమ్మ ఆకుల టీ బాగా పనిచేస్తుంది
దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తరచుగా వచ్చే కాలానుగుణ దగ్గు. జలుబు నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు యొక్క ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి. ఇవే కాకుండా వివిధ రకాల చిన్న ఆరోగ్య సమస్యలకు దానిమ్మ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి..
ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ ఆకులు నిద్రలేమికి బెస్ట్ రెమిడీ అని చెబుతారు. ఒక పాత్రలో మూడు వంతుల నీరు తీసుకోండి. దానిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి అందులో నీళ్లలో వేసి.. వాటర్ సగానికి తగ్గే వరకు బాగా మరిగించాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇది మీకు నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
మీరు దురద, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే నయమవుతుంది. అంతేకాదు శరీరంలోని పుండ్లు, గాయాలకు దీన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది.
చెవి ఇన్ఫెక్షన్లు, నొప్పితో బాధపడేవారు దానిమ్మ ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని తీసి, నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని రెండు చెవుల్లో వేయాలి. ఇలా చేస్తే చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఎవరికైనా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అలాగే ముఖంపై మొటిమలు తగ్గాలంటే దానిమ్మ ఆకులను పేస్ట్ లా చేసి మొటిమల మీద రాస్తే ముఖం మచ్చలు లేకుండా తయారవుతుంది.
మీరు తరచుగా అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే, రోజూ రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకోండి లేదా ఈ ఆకులను జీలకర్ర, మిరియాలతో మెత్తగా చేసి పెరుగుతో తాగాలి
వాము ఆకు
వాము ఆకు మొక్క మనందరికీ చాలా మందికి తెలుసు. సాధారణంగా ప్రతి ఇంటి పెరట్లో కనిపిస్తుంది. వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వామాకు తింటే జీర్ణ సమస్యలు, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు దూరమవుతాయి. వామాకు జీవక్రియను మెరుగుపరుస్తుంది. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే.. వామాకు మీకు మంచి ఆప్షన్. ఒకటి లేదా రెండు ఆకులు కోసి తింటే చాలు.. మీకు కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వామాకులో ఎ, బీ, సీ విటమిన్లు, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం ఉన్నాయి.
పుదీనా
ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది. పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్ఫరస్,విటమిన్ సీ, డీ, ఈ, బీ లు పుష్కలంగా ఉంటాయి.
కరివేపాకు
చాలా మంది కూరల్లో కరివేపాకు కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తారు. కానీ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ను ప్రేరేపిస్తుంది, పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. కరివేపాకు తింటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకమూ కడుపు ఉబ్బరానికి ఓ కారణం. అలాగే భోజనం తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకుని బాగా నమిలి మింగేస్తే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
నేరేడు ఆకులు
నేరేడు ఆకుల్లో జీర్ణక్రియ గుణాలు మెండుగా ఉన్నాయి. అన్ని జీర్ణ క్రియ సమస్యలకు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫ్లాట్యులెంట్ లక్షణాలు అలిమెంటరీ కెనాల్‌లోని గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గ్యాస్ సమస్య, మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో యాంటాసిడ్ లక్షణాలు ఉన్నాయి. నేరేడు ఆకులు తింటే.. కడుపులో యాసిడ్ ఎక్కువగా పేరుకోకుండా చేస్తుంది. తద్వారా అజీర్తి, అల్సర్, గ్యాస్ట్రిటిస్ సమస్యకు చికిత్స చేస్తుంది.
సోంపు ఆకులు
సోంపు ఆకులు తీసుకున్నా.. కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలకు సోంపు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. సోంపు ఆకులను నమలడం వల్ల అల్సర్లు రాకుండా ఉంటాయి. గ్యాస్ సమస్య తగ్గుతుంది. రోజూ సోంపు ఆకు తింటే.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం వల్ల కూడా కడుపుబ్బరం రాకుండా ఉంటుంది.
వేసవిలో కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ-కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది.. వంటల్లో ఉప్పు తగ్గిస్తే.. మంచిదంటున్నారు నిపుణులు.
వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతాం. కూల్ డ్రింక్ ఎక్కువగా తాగినా.. కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే తక్కువగా తాగండి
కొంతమందికి మైదాతో చేసిన పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరానికి గురవుతుంటారు. కాబట్టి ఈ పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది.
శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే సహజ చక్కెర అధిక వినియోగంపై చాలా ప్రాధాన్యత ఉంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెరకు బెల్లం మంచి ప్రత్యామ్నాయం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. బెల్లం తీసుకోవడం ద్వారా, మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలోని బ్లడ్ షుగర్ మనం చక్కెరను తినడం ద్వారా ఆశించే స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల బెల్లం చక్కెరను పోలి ఉంటుంది.
బెల్లం ఎవరు తినాలి?
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఇది ఐరన్ , మెగ్నీషియం మంచి మూలం , అందువల్ల ఇది మీ హిమోగ్లోబిన్‌కు మంచిది, అయితే బెల్లం వినియోగం మధుమేహం లేని రోగులకు మాత్రమే మంచిది.
బెల్లం, నెయ్యి
ప్రతి ఒక్కరికి స్వీట్ తినాలన్న కోరిక కలగడం సహజం. ఐతే, ఈ కోరికను ఎలా డీల్ చేశామన్న దానిపై రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయని గమనించాలి. బెల్లాన్ని నేతితో కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, నేతిలో ముఖ్యమైన ఫ్యాట్స్ లభిస్తాయి. ఈ రెండూ కలిపి డైజెషన్ స్మూత్ గా జరిగేందుకు హెల్ప్ చేస్తాయి. అలాగే ఇంటస్టైన్స్ హెల్త్ ను కూడా సంరక్షిస్తాయి. కాబట్టి, మీరు చేయవలసిందేంటంటే, బెల్లం పౌడర్ ను తీసుకుని అందులో కాసింత నెయ్యిని కలపండి. లంచ్ తరువాత ఈ మిక్స్ ను తినండి. ఈ రెమెడీ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు.
మస్కమేలన్:
చాలాసార్లు శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. కాబట్టి, ఈ సమస్యను హెల్తీ వేలో డీల్ చేయాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవడం ముఖ్యం. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ను తీసుకోవడం మరీ ముఖ్యం. దాంతో, శరీరంలో వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ భర్తీ అవుతుంది. మస్క్ మెలన్ పై కూడా ఫోకస్ పెట్టాలి. ఇది బ్లోటింగ్ సమస్యనునివారిస్తుంది. మస్క్ మెలన్ ను సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో దీన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనె అనేది కాన్స్టిపేషన్ ను తగ్గించే రెమెడీస్ లో అత్యంత పాపులరైనది. కాబట్టి, దీన్ని డిన్నర్ లో తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. నువ్వుల నూనెలో ఫైబర్ తో పాటు విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ముఖ్యమయిన ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఒక స్పూన్ ను పిండితో కలుపుకుని తినండి. కాన్స్టిపేషన్ సమస్యను సరైన సమయంలో పరిష్కరించుకోకపోతే ఇంకొన్ని డేంజరస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. పైన చెప్పుకున్నటువంటి ఫుడ్ రెమెడీస్ తో పాటు మీరు మరికొన్ని చిట్కాలను పాటిస్తే త్వరగా రిజల్ట్స్ ను త్వరగా చూడగలుగుతారు.
నీళ్లను తాగండి:
తగినన్ని నీళ్లను తాగడం వలన కాన్స్టిపేషన్ ను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం కూడా కాన్స్టిపేషన్ ను కారణం. కాబట్టి, తగినన్ని నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. అవసరమైతే రిమైండర్స్ పెట్టుకోండి.
వ్యాయామం చేయండి:
అనేక ఫుడ్ రెమెడీస్ మన డైట్ లో భాగంగా చేసుకున్నా మన లైఫ్ స్టైల్ లో మార్పులు లేకపోతే ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లెమ్ వస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. బాడీ యాక్టివ్ గా ఉంటుంది, డైజెషన్ కుల యాక్టివ్ గా ఉంటుంది.
కాఫీ తాగండి:
కాఫీ తాగడం వలన బాత్రూంకు వెళ్లాలన్న అవసరాన్ని గమనించగలుగుతారు. ఎందుకంటే, డైజెస్టివ్ సిస్టమ్ లోని మజిల్స్ ను కాఫీ యాక్టివ్ చేస్తుంది కాబట్టి. అలాగే, కాఫీలో సాల్యుబుల్ ఫైబర్స్ కూడా చిన్నమొత్తంలో లభిస్తాయి. ఇవి గట్ బాక్టీరియాను బాలన్స్ చేస్తాయి. దాంతో, కాన్స్టిపేషన్ సమస్య రాకుండా చేస్తాయి. ఐతే, ఈ రెమెడీ అందరికీ సూట్ కాకపోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు మీ శరీరమిచ్చే సూచనలను గమనించాలి. మీరు తీసుకుంటున్న డైట్ వలన ప్రయోజనం ఉందో లేదో శరీరమిచ్చే సూచనల ద్వారా మీకు తెలుస్తుంది. గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
పెరుగు
మీ రోజువారీ మీల్స్ లో పెరుగుకు స్థానం కలిగించడం ద్వారా కూడా మీరు ఉపశమనం పొందవచ్చు. పెరుగు ప్రోబయాటిక్ ఫుడ్. డైజెషన్ ను ఇంప్రూవ్ చేసే క్వాలిటీ పెరుగులో ఉంది. అందుకే, దీన్ని బెస్ట్ కాన్స్టిపేషన్ రెమెడీ అనంటారు. భారతీయలు తమ భోజనంలో పెరుగు లేదా మజ్జిగతోనే ముగిస్తారు. ఇలా ఇండియన్స్ తమ డైట్ లో పెరుగుకు కూడా స్థానమిచ్చారు. కూలింగ్ ప్రాపర్టీస్ ఉండటం వలన పెరుగు స్టమక్ లోని ఇన్నర్ లైనింగ్ కు ఉపశమనం ఇస్తుంది. డైజెషన్ ప్రక్రియ స్మూత్ గా సాగేందుకు తోడ్పడుతుంది. అందుకే, అప్సెట్ టమ్మీకి కూడా పెరుగును వాడమని నిపుణులు అంటుంటారు. అంతేకాదు, పెరుగులో ఉండే కేల్షియం ఎముకలను స్ట్రాంగర్ చేస్తుంది.
హాట్ వాటర్ బాత్:
కాన్స్టిపేషన్ తీవ్రతను తగ్గించేందుకు హాట్ వాటర్ బాత్ కూడా హెల్ప్ చేస్తుంది. హీట్ థెరపీ అనేది కండరాలను రిలాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. హీట్ పాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ తో పొట్టకు హీట్ థెరపీ ఇచ్చినా మీరు ప్రయోజనాన్ని గమనించగలరు. ఈ ఫుడ్ రెమెడీస్ అలాగే టిప్స్ తో కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ లభిస్తోందని చాలామంది చెబుతున్నారు.
Be the first to comment