ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. భారీగా తగ్గనున్న ధరలు..!

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. భారీగా తగ్గనున్న ధరలు..!

హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గాలి కాలుష్యం కూడా పెరుగుతోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఎలక్రిక్‌ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్‌, ట్యాక్సీలు, త్రీ సీటర్ ఆటోలు, ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్లు (మూడు చక్రాల గూడ్స్ క్యారియర్ వాహనాలతో సహా), ట్రాక్టర్లు, బస్సులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. రవాణా రంగంలో ఇవే కీలకం కావడంతో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. తొలుత రెండేళ్ల పాటు అమల్లో ఉండే సరికొత్త ఈవీ పాలసీని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. దీంతో పాటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈవీ తయారీదారులను ఆయన కోరారు.

దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు, టూవీలర్స్‌ వినియోగం క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇటు ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. ఇప్పటికే పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోసం ఉపయోగించబోయే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఏదైనా పరిశ్రమకు చెందిన బస్సులకు వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. అలాంటి వాటికే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది

రిజిస్ట్రేషన్లతో సంబంధం లేకుండా 2026 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు ఈ మినహాయింపు వర్తిస్తుందని వివరించింది. ఇందుకు సంబంధించి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌తో కలిసి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు అవగాన కల్పించాలన్నారు. హైదరాబాద్ కు ఢిల్లీ పరిస్థితి రాకూడదంటే.. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగాలని పొన్నం చెప్పారు. ఈవీ పాలసీని నాలుగు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి రూపొందించినట్లు పేర్కొన్నారు. రవాణా, హోం, హెచ్‌ఎండీఏ తదితర శాఖల మధ్య సమన్వయం కోసం 10 రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

కాగా తెలంగాణలో ఇప్పటి వరకు 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని పొన్నం ప్రభాకర్ చెప్పారు. వచ్చే రెండేళ్ల వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*