
రూ.2 వేల కోసం లోన్‌యాప్ వేధింపులు.. ఉరివేసుకొని యువకుడు మృతి
విశాఖ – అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర(21)కు 40 రోజుల కిందే పెళ్లి జరిగింది.
అతను లోన్ యాప్ నుంచి అప్పు తీసుకోగా నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్లో ఉండగా లోన్‌యాప్ నిర్వాహకులు వేధించారు.
తన ఫోటో, తన భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Be the first to comment