
జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం…
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి స్ఫూర్తితో లంక లితీష్ 5000 /-రూపాయలు ఆర్థిక సహాయం..
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం..
మైలవరం గ్రామంలోని అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్న జనసేన కార్యకర్త పాతాటి.గోపి అంగవైకల్యం కలిగి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు.
పార్టీలకతీతంగా సమాచారం అందిన వెంటనే స్పందించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ గోపి కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల తో 5000/- రూపాయలు ఆర్థిక సాయం చేసి,కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు…
ఈ కార్యక్రమంలో దూరు బాలకృష్ణ, బుడుపుటి వెంకట్రావు, మైక్ బాబురావు,జి. రమణ,నూతక్కి సతీష్,తమ్ముండ్రు ఎలిజారావు, తదితరులు పాల్గొన్నారు
Be the first to comment