
అఖిలపక్ష సమావేశంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు
రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తామని వెల్లడి
ఈనెల 25 నుండి డిసెంబర్ 20 వరకు జరగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార టీడీపీ పార్టీ నుండి.. టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.
పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో..
ఆంధ్రప్రదేశ్ తరుపున పార్లమెంట్లో లేవనేత్తే అభివృద్ధి, సంక్షేమ అంశాలను చర్చించిన ఎంపీ లావు.
ప్రధానంగా..ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన హామీలు, రావాల్సిన నిధులు గురించి చర్చించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు అభివృద్ధి చెందలేదు అనే అంశం.
గోదావరి – పెన్నా నదుల అనుసంధానం.
పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి అంశం.
కేంద్ర విద్యా సంస్థల అభివృద్ధి.
విదేశాల్లో వలస కార్మికులకు రక్షణ చట్టం
కౌలు రైతుల సంక్షేమం గురించి..
డిజాస్టర్ మేనేజ్మెంట్ విధానాలు గురించి..
సోషల్ మీడియాలో విచ్చలవిడి ధోరణిపై చర్యలు, చట్టాలు గురించి పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముఖంగా తెలియజేశారు.
Be the first to comment