సూరవరపు వేంకటేశ్వర్లు ( తొలి స్త్రీ పాత్రధారి ).

అఖిల భారత బలిజ, కాపు కళాకారులు, క్రీడాకారులు

సూరవరపు వేంకటేశ్వర్లు ( తొలి స్త్రీ పాత్రధారి ).

గుంటూరు జిల్లా బాపట్లలో బలిజ కాపు కుటుంబంలో సూరవరపు వేంకటేశ్వర్లు జన్మించారు. పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు కూడా (బ్రాహ్మిన్ )స్త్రీ పాత్రధారి ఇక్కడే జన్మించారు. ఇద్దరు స్త్రీ పాత్రల్లో అమోఘమైన పేరు పొందినవారే. ” “మైలవరం భాలభారతి సమాజం “నిస్తేజంగా ఉన్నప్పుడు దైతా గోపాలం గారు 1931 సం. లో సతీ సక్కుబాయి నాటకం వ్రాయించి ప్రదర్శనకు పూనుకున్నప్పుడు అత్త జమునాబాయి పాత్రకు తగిన నటుడు దొరక్క నాటకం ఆగిపోయింది. సూరవరపు వారికి స్త్రీ పాత్రల్లో ఉన్న ఆదరణ చూసి ధైతా గోపాలం గారు తమ సంస్థలోకి ఆహ్వానించి సక్కుబాయి నాటకానికి అత్తపాత్ర వేయిస్తే నాటకం బహు రసరంజకంగా తయారై సూపర్ హిట్టయింది. బెజవాడలో ఆ నాటకం ఎప్పుడు ప్రదర్శన పెట్టుకున్నా మూడు రోజులు ముందుగానే టిక్కెట్లు అమ్ముడుపోయేవి. ఆ పాత్రలో కాఠిన్యం, దుర్మార్గాన్ని పండించారు సూరవరపు వారు. విధవ వేష ధారణలో కాఠిన్యం ప్రదర్శిస్తూ, బుగ్గన చేయి ఉంచి సక్కుబాయిని రాచి రంపాన పెట్టె పాత్ర ప్రవేశం, నిష్క్రమణలకు ప్రేక్షకులు ఉగ్రులై పోయేవారు. అలా చింతామణిలో శ్రీహరి పాత్ర, పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, విప్రనారాయణలో, దేవకీ దేవితల్లి పాత్ర, ధరణికొట నాటకాల్లో స్త్రీ పాత్రల్లో అమోఘమైన పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వి. రామానందం గారు 1954 లో సతీ సక్కుబాయి చిత్రంలో అత్త పాత్రకు సూరవరపు వారిని ఎంపిక చేశారు. అలా తెలుగు చిత్ర సీమలో తొలి స్త్రీ పాత్ర పోషించిన నటుడుగా వినుతికెక్కారు. వీరు రంగూన్, కలకత్తా, టాటా నగర్, బొంబాయ్, మైసూర్, బెంగుళూరు, మద్రాస్ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖ హిందీ నటులైన ” దుర్గాఖోటే, గోవిందరావు టాంబేలచే సత్కారాలందుకున్నారు. H. M.V గ్రామ్ ఫోన్ కంపెనీ వారికి (పాటల రికార్డ్ ) సక్కుబాయి, రాధాకృష్ణ, భక్త పుండరీక, నాటకాలకు గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు. సూరవరపు వారి పేరు ఆంధ్రా అంతటా మారుమోగి పోయింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు, చల్లపల్లి రాజాగార్లు కొరకు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి, వారిచే స్వర్ణ, రజత పతకాలు అందుకున్నారు. చివరిదాకా నాటక రంగానికి అమోఘమైన సేవ లందించారు. నాకున్న అదృష్టం ఏమిటంటే మా నాన్నగారు మేజర్ పంచాయితీ వైస్ సర్పంచ్ గా ఉంటూ ఒక పుష్కరకాలం 1964 నుండి 1976 వరకు చాలా నాటకాలు ఉద్దాండులైన నటులతో నాటకాలు ప్రదర్శించారు సతేనపల్లి శరభయ్య హైస్కులు లో. అలా మా నాన్నగారితో కలిసి చింతామణి లో శ్రీహరి పాత్రకు సూరవరపు వారిని బెజవాడలో వారి ఇంటిలో కలిసి వారికి అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. వారికి మొహం మీద స్పోటకం మచ్చలు ఉండేవి. ఇది నా స్వానుభవం, నా అదృష్టం. భట్టరుశెట్టి వారి గ్రంధం నుండి సేకరణ : బుడగాల సుబ్బారావు,కాపునాడు రాష్ట్ర కార్యదర్శి, ఎస్విర్, మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*