
మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలు పై గాదె స్పందిస్తూ:
* వారంటే తమ పార్టీ వారికి ఎంతో గౌరవం అని, ఎంతో విజ్ఞులుగా ఉండే మందకృష్ణ మాదిగ గారు సైతం ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిపై ఒక కులముద్ర వేయాలని ప్రయత్నిస్తే తాము సహించబోమని, పవన్ కళ్యాణ్ గారు అన్నీ కులాల కోసం అన్ని మతాల కోసం పనిచేస్తారని, మన కుల మతాలను పాటిద్దాం అలాగే పక్క కులాల మతాలను గౌరవిద్దాం అని చెప్పే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని చెప్పారు. జనసేన పార్టీలో అనేక పదవులలో మాదిగ సామాజిక వర్గం చెందినవారు ఎంతో ఆనందంగా పనిచేస్తున్నారని అలాంటి జనసేన పార్టీని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా ఎంతో విజ్ఞతతో మాట్లాడతారని ఆ విషయం పైన మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేశారు
Be the first to comment