దేశాన్ని రక్షించిన మహారాష్ట్ర

దేశాన్ని రక్షించిన మహారాష్ట్ర

ఇదేదో బీజేపీని గెలిపించింది అన్న ఉత్సాహంతో కాదు. దేశాన్ని మరో 1947 దేశవిభజన ప్రమాదం నుండి కాపాడినందుకు.

మహారాష్ట్రలో గెలుపుకోసం కాంగ్రెస్ ముస్లింసంస్థలు పెట్టిన ప్రతి డిమాండుకూ ఒప్పుకుని ఒప్పందాలు చేసుకున్నారు.

పోలీసుల్లో ముస్లింలకు ప్రాతినిధ్యమూ, ముస్లింలకు 10% రిజర్వేషన్లూ, 1000 కోట్లు నిధులూ, మదరాసాల నిర్వాహణకు ప్రభుత్వాల నిధులూ, ఎవరి ఆస్తినైనా చిన్ననోటీసుతో లాక్కునే అధికారం కల వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకించటమూ, ముంబై అల్లర్లతో పాటు దేశంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న ముస్లింల మీద కేసులు ఎత్తివేయటమూ– ఇలా మొత్తం 17 ముస్లిం డిమాండ్లను ఒప్పుకుని ఒప్పందం చేసుకోవటమూ మనకు తెలుసు.

ఇందుకు ప్రతిగా ముస్లిం ఉలేమాలూ, ముస్లిం లా బోర్డు సభ్యులు, ఇక్కడ మహరాష్ట్రలో బీజేపీని ఓడిస్తే, కేంద్రంలో హిందూ అనుకూల జాతీయవాద నరేంద్రమోదీ ప్రభుత్వ పతనం ఖాయం కాబట్టి, ముస్లింలు అందరూ కాంగ్రెస్ కూటమికి ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారంటే, ముస్లించాందసవాదాన్ని కాంగ్రెస్+ ఎలా మోస్తున్నదో, అది ఎంతప్రమాదకరమో మనం గ్రహించవచ్చు.

*బీజేపీ గానీ నరేంద్రమోడీ గానీ ఇవాళ పదవిలో ఉండవచ్చూ రేపు దిగిపోనూ వచ్చు. కానీ ఈ దేశమూ ఈ దేశంలోని హిందువులూ మరి ఇతరమతాల ప్రజలు ఉంటారుగా. ఓట్ల కోసం కేవలం ఒక మతానికి లొంగిపోతే, హిందువుల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సింది మనమే.*

ఓట్ల కోసం ముస్లీం నాయకులకు కాంగ్రెస్ తదితర సెక్యులర్ పార్టీలు ఒప్పుకున్న డిమాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే గతం గుర్తుకు వస్తుంది.

1916 లో గాంధీని దక్షిణాఫ్రికా నుండి ఇక్కడికి దిగుమతి చేసారు.

గాంధీ దక్షిణాఫ్రికా నుండి సరాసరి భారత్ కు రాకుండా, చుట్టూ తిరిగి లండన్ వెళ్ళి బ్రిటీష్ అధికారులనూ నాయకులనూ కలసీ భారత్ చేరుకున్నాడు.

రావటం రావటమే హిందూ ముస్లిం ఐక్యతా రాగాన్ని మొదలెట్టాడు. స్వతంత్రపోరాటానికి అది తారకమంత్రం అని జాతిజనానికి ఇంజక్ట్ చేసాడు.

ఈ హిందూ ముస్లిం ఐక్యత ఎంతవరకూ వెళ్ళిందంటే, ముస్లింల కోసం ఏమైనా చేస్తానికి, హిందువుల ప్రయోజనాలూ, రక్షణా పణంగా పెట్టేంతగా.

ఎక్కడో టర్కీలో, కమాల్ పాషా నాయకత్వంలో జనం తిరుగుబాటు చేసి పదవి ఊడగొట్టిన ఖలీఫా కోసం ఇక్కడ ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం మొదలెడితే గాంధీ దాన్ని భుజాన వేసుకున్నాడు.

సాక్షాత్తు ముస్లిమే అయిన మహమ్మదాలీ జిన్నా సైతం రాజాకీయాల్లో మతాన్ని చొప్పించటాన్ని వ్యతిరేకించినా, ఖిలాఫత్ గోల మనకు అనవసరం అని అభ్యంతరపెట్టినా, మిగతా కాంగ్రెస్ నాయకులు వద్దు వద్దు అని గగ్గోలు పెట్టినా, గాంధీ మాత్రం హిందూ ముస్లిం ఐక్యత పేరుతో ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెస్ సమర్ధించేలా వత్తిడి చేసాడు.

ఆ ఖిలాఫత్ ఉద్యమంలో వేలాదిమంది హిందువులను ఊచకోత కోసారు. స్త్రీలను మానభంగం చేసారు. దేవాలయాలను కూల్చివేసారు. గాంధీ అయ్యో పాపం అనకపోగా, ముస్లిములు తమ మతం కోసం పోరాడిన ధర్మవీరులని శ్లాఘించాడు.

ప్రత్యేకదేశం కోసం జిన్నా ఇచ్చిన పిలుపు మేరకు డైరెక్షన్ ఆక్షన్ డే నాడు ముస్లింలీగ్ వాళ్ళు వేలాదిమందిని నరికి చంపితే, హిందువులు తిరగబడబోతే, ఆమరణనిరాహారదీక్ష తో ఎమోషనల్ బ్లాక్‍మెయిల్ చేసి, ముస్లీంల మీదకు వెళ్ళకుండా కట్టడి చేసాడు. దేశంలో ఎప్పుడు హిందువులను ఊచకోత కోసినా ముస్లింల మీద దాడి చేయకుండా ఆమరణనిరాహారదీక్షతో ఎమొషనల్ బ్లాక్‍మెయిల్ చేసి కట్టడి చేసేవాడు.

ముస్లింలీగ్ కోరిన ప్రతి గొంతెమ్మకోరికనూ గాంధీ ఒప్పుకుని నెరవేర్చేవాడు. చివరకు దేశవిభజన జరిగి పాకిస్తాన్ లో హిందూనరమేధం జరుగుతున్నా, స్త్రీలను రేప్ చేస్తున్నా, గాంధీ ఇక్కడి ముస్లింల భద్రత కోసం ఆరాటపడేవాడు తప్ప పాకిస్తాన్ లో మారణకాండకు గురిఅవుతున్న హిందువుల రక్షణ కోసం మాత్రం మౌనంగా ఉండేవాడు. హిందువులు ముస్లింల చేతిలో చంపబడ్డా, తిరగబడక, ప్రశాంతంగా చచ్చిపోండి తప్ప, ముస్లింల మీద ద్వేషం పెంచుకోగూడదు అని భోధించాడు.

చివరకు కాశ్మీర్ మీద యుద్దానికి వచ్చిన పాకిస్తాన్ కు ప్రభుత్వం మెడలు వంచి 55 కోట్లు (ఇప్పటి విలువ ఏ 55000 కోట్లో) ఇప్పించాడు,

కాశ్మీర్ లొ మెజారిటీ ప్రజలు ముస్లింలు కాబట్టి మహారాజా హరిసింగ్ ను గద్దె దిగమని అడిగేవాడు తప్ప, రజాకార్లు ఎంత దారుణాలు చేస్తున్నా హైదరాబాద్ నిజాం విషయంలో మాత్రం మాట్లాడేవాడు కాదు.

ఇలాంటివెన్నింటినో గాంధీ చేసినా, చివరకు మిగిలిందేమిటి? హిందూ ముస్లిం ఐక్యత సాధ్యం అయ్యిందా ?

పాకిస్తాన్ విడిపోయింది. అక్కడి హిందువులను ఊచకోత కోసి తరిమేసారు. ఈ దేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ ఇవాళ దేశానికి శాశ్వతశత్రువు.

*అప్పుడు గాంధీ చేసినదే 1947 తర్వాత కూడా కాంగ్రెస్ చేస్తూనే వస్తున్నది. అయినా హిందూ ముస్లిం ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదు ?*

దేశంలో జిహాదీ ఉగ్రవాదం పెరిగిపోయింది. కాశ్మీర్ లోయ నుండి, పాకిస్తాన్ లో వెళ్ళగొట్టినట్లు, హిందువులను ఊచకోత కోసి వెళ్ళగొట్టారు. ముస్లిం మెజారిటీ ఇలాకాలలో అన్యమతప్రజలకు భద్రత లేకుండాపోయింది.

దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. హిందూదేవాలయాలకు భద్రత లేదు. చర్చీలకూ మసీదులకూ లేని పోలీసురక్షణ కేవలం హిందూదేవాలయాలకే ఎందుకు అవసరం అవుతున్నది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ?

క్రైస్తవసభలకూ ఊరేగింపులకూ, ఇస్లామిక్ సభలకూ ఊరేగింపులకూ అవసరం లేని పోలీసు రక్షణ, హిందూ పండగలకూ ఉత్సవాలకూ ఎందుకు అవసరం అవుతున్నదో మనం ఎప్పుడైనా ఆలోచించామా ?

ఓట్ల కోసం మైనారిటీ మతాల ఒత్తిడి కోసం లొంగిపోయి, అలవిమాలిన వరాలిచ్చుకుంటూపోతే హిందువుల పరిస్థితి ఎమిటి ?

ఈ విషయం మనం ఆలోచించకపోయినా మహారాష్ట్రులు ఆలోచించారు. కర్రు కాల్చి వాతబెట్టారు. ఓట్ల కోసం హిందువుల ప్రయోజనాలను అమ్మేస్తానికి దిగజారిన రాహుల్ గాంధీ శరద్ పవార్ లాంటివారినీ, వారి మధ్య టుమ్రీగాడు అయిన ఉద్దవ్ ఠాకరేనూ చావుదెబ్బ కొట్టారు.

ఒకనాడు ఔరంగజేబూ తదితర ఇస్లామిక్ నియంతలను చావుదెబ్బ తీసి హిందూధర్మాన్ని కాపాడిన మహారాష్ట్రులే, ఇవాళ్టి నయా హిందూద్రోహుల పీచమణచి తమ శివాజీ మహారాజ్ వారసత్వాన్ని నిలబెట్టారు.

అందుకే దేశాన్ని రక్షించిన మహారాష్ట్ర అన్నది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*