దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తే యువతి యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగు

దుగారాజపట్నం  పోర్టు  వలన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి… కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు చింత మోహన్

దుగరాజపట్నం ఆంధ్రుల హక్కు. విభజన చట్టంలో రెండో ప్రధాన అంశంగా పార్లమెంటు ఆమోదముద్ర వేయడం జరిగింది. పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి. దాదాపు 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఒక లక్ష మంది రైతులు కోటీశ్వరులు అవుతారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు లక్షాధికారులవుతారు. ఈ సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ దుగరాజపట్నం పోర్టును తీసుకురావడం జరిగింది.‌

దుగరాజపట్నం పోర్టును ఆపిందెవరు? శ్రీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఆపారు? అప్పటి ఓనర్ చింతా విశ్వేశ్వరరావుకి లాభం తగ్గుతుందని, నితీన్ గట్కరికి జాబు రాసి ఆపారు.

అమరావతి రాజధాని

అమరావతి రాజధాని కట్టేందుకు 50 వేల ఎకరాలు అవసరమా? భారతదేశ రాజధాని న్యూఢిల్లీ కట్టేందుకు 17 వేల ఎకరాలలో, 100 సంవత్సరాల్లో పూర్తయింది. అమెరికాలో న్యూయార్క్ నగరాన్ని కట్టేందుకు 14 వేల ఎకరాలు, 300 సంవత్సరాలు కాలం పట్టింది. అమరావతి కట్టేందుకు 100 సంవత్సరాలు కనీసం అవసరమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 5 వేల ఎకరాలు చాలు. హడ్కో నుంచి 11 వేల కోట్ల రూపాయల అప్పు, 9శాతం వడ్డీతో, ప్రతి నెలా అసలు, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉందా? లేదా?

గోదావరి నుంచి పెన్నాకి నీళ్ళు
పై ఆలోచనలు పక్కన పెట్టి, దుగరాజపట్నం పోర్టు, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*