
మైనర్ విద్యార్థి మైధిలి మరణం కేసులో జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, కుంచాల కృపాకర్ లఫై ఒంగోలులో కేసు నమోదు
క్రీడాకారిణి సన్నేబోయిన మైధిలి మరణానికి రోడ్డు ప్రమాదం ఒక్కటే కారణం కాదు, మైధిలి వినుకొండలో టోర్నమెంట్ ముగించుకొని కావలి శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించేవరకు చోటు చేసుకున్న ప్రతిఘటన కూడా కారణమే. జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, కుంచాల కృపాకర్ లు ముగ్గురు కూడా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మైనర్ విద్యార్థి మైధిలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలులో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మైధిలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈరోజు CI గారిని కలిసిన వారిలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, చైతన్య ప్రసాద్, చిరుమామిళ్ల గోపి కృష్ణ యాదవ్ (యాదవ్ JAC జిల్లా అధ్యక్షులు), బంకా చిరంజీవి (BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు), మిరియం శ్రీనివాసులు (యాదవ్ JAC వ్యవస్థాపక అధ్యక్షులు).
Be the first to comment