
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆదివారం హొటల్ వీనీలా యందు ఉద్యోగ సంక్షేమ సంఘం నెలవారీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథి లుగా పెద్దలు శాసపు జోగినాయుడు, రాడ కైలాసరావు పాల్గొన్నారు.
ముఖ్య ఏజెండా ఏమిటంటే ….
1. కొన్ని మండలాలలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గూర్చి చర్చించారు.ఆయా మండలాలలో ఉన్న పెద్దలకు కలసి తూర్పు కాపు ఉద్యోగులకు బాసటగా నిలవాలని తెలియజేయుట.
2. సంఘం బలోపేతానికి ప్రతీ డిపార్ట్మెంట్ నుండి ఒకొక్క ప్రతినిధిని చేర్చుకుని అన్ని శాఖల నుండి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకొనుట.
3. పేద విద్యార్థులకు సహాయాన్ని అందించుట..
4. అవసరమైన సందర్భంలో పెద్దల సహాయ సహకారాలు తీసుకొనుట…
5. సుడా చైర్మన్ గా నియమితులైన పెద్దలు కొరికాన రవికుమార్ గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు మొదలైన విషయాల గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు,పెద్దలు పాల్గొన్నారు….
Be the first to comment