కొండపై తిష్ట వేసిన తట్టల తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈవో శ్యామలరావు

అనధికారిక హాకర్ల పై విజిలెన్స్ రహస్య విచారణ

కొండపై తిష్ట వేసిన తట్టల తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈవో శ్యామలరావు

రాజకీయ ఒత్తిడులను పట్టించుకోవద్దన్న అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి

వారంలోగా రంగంలోకి టాస్క్ ఫోర్స్

రాజకీయ పార్టీల అండదండలతో అసాంఘిక శక్తుల రూపంలో స్థానికేతరులు అనేకమంది కొండపై తిష్ట వేశారు*. *అనధికారిక హాకరుల ముసుగులో చెలామణి అవుతున్నారు. యాత్రికులు తిరుగాడుతున్న అనేక కీలక ప్రాంతాలలో స్థలాలు ఆక్రమించుకున్నారు*. *అక్కడతట్టలు(చిన్నపాటి దుకాణాలు)ఏర్పాటు చేసుకొని* *జులాయిలను చేరదీస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు*. *రాజకీయ పెద్దల అండదండలతో పరోక్ష సహకారంతో కొండపై సుమారు 580 తట్టలు ఇలా అక్రమంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు కనుగొన్నారు. ఇప్పుడు గత మూడు రోజులుగా టిటిడి విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ అక్రమ వ్యవహారం నిగ్గు తేల్చే దిశగా రహస్య విచారణ జరుపుతోంది. గత నెలలో టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలనలో వెల్లడైన జాబితాను టీటీడీ విజిలెన్స్ వింగ్ మళ్లీ పున పరిశీలిస్తోంది. అందులో వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు*

ఇప్పటికే ఈ ఆక్రమణలపై టీటీడీ పంచాయితీ రెవెన్యూ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ జరిపి ఒక జాబితాను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ జాబితా ప్రకారం తిరుమల కొండపై పునరావాసం కింద నిర్వాసితులైన స్థానికులకు 1135 దుకాణాలు, 719 హాకరు లైసెన్సులు, టిటిడి ఇప్పటివరకు మంజూరు చేసింది. వీటికి టెనెంట్ నెంబర్ కేటాయించి అధికారికంగా అద్దెలు వసూలు చేస్తున్నారు.‌ ఇక్కడ వరకు ఎటువంటి సమస్య లేదు కానీ.. ఇవి కాకుండా గత పాలకమండలి హయాంలో 151 మంది ఇతరులు తమకు హాకరు లైసెన్సులు మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్నారు.. దీనిపై అప్పటి కరుణాకర్ రెడ్డి పాలకమండలి పూర్తి వివరాలు విచారణ జరిపి తిరిగి బోర్డుకు నివేదిక అందించాల్సిందిగా అప్పటి రెవెన్యూ అధికారులకు సూచించింది.

దీనిపై విచారణ జరిపిన నాలుగు బృందాల రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో 74 మంది మాత్రమే టీటీడీ అనుమతి లేకుండా, ఎలాంటి అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు లెక్క తేల్చింది. అందులోనూ చాలామంది విచారణకు స్వయంగా హాజరు కాలేదని పేర్కొంది.‌ కేవలం 29 మంది వ్యక్తులు మాత్రమే హాకరు లైసెన్సులు పొందటానికి అర్హతగా స్థానిక ద్రువ పత్రాలు కలిగి ఉన్నారని వివరించింది.‌ ఇవన్నీ ఇలా ఉంచితే మరో 580 తట్టలు అక్రమంగా రాజకీయ ఒత్తిడితో పలుకుబడితో టీటీడీ వ్యవస్థను లెక్కచేయకుండా
కొండపై అక్రమ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు గుర్తించారు.‌ వీటి కారణంగా నిజమైన స్థానికులకు వ్యాపారం జరగకుండా నష్టం కలగడమే కాకుండా, భవిష్యత్తులో తిరుమల లో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం, అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు అని అంచనా వేశారు.‌

120 కోట్ల మంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ భద్రత కోసం ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్న టీటీడీ, నిఘా పోలీసు వ్యవస్థలు తొలుతగా తిరుమలలో ఆనధికారిక హాకర్లు, అనామకుల ఏరివేత, ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు మరో వారం రోజుల్లో కొండపై అనధికారిక వ్యక్తుల పేరుతో చలామణి అవుతున్న తట్టలను పూర్తిగా తొలగించే ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి పూర్తి వివరాలను అధికారుల నుండి రాబట్టగలిగారు.‌ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగితే ఎదురయ్యే రాజకీయ ఒత్తిడిలు పలుకుబడి పైరవీలు తదితర పరిస్థితులను కూడా అంచనా వేశారు.‌ ఇదే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన నివేదించినట్లు తెలిసింది.‌ చివరగా అధికారులతో సమీక్షించుకుని మీరు ఎటువంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా పనిచేయండి.‌ ఎంతటి రాజకీయ ఒత్తిడిలు వచ్చినా మేము చూసుకుంటాం..‌ అంటూ పంచాయతీ రెవెన్యూ సంబంధిత అధికారులకు భరోసా కల్పించారని సమాచారం.‌

ఈ అనధికారిక తట్టలను తొలగించేందుకు అటు తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కూడా పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. క్షేత్రస్థాయిలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనే పూర్తి అంశాలతో ఇప్పటికే తన వద్ద ఉన్న ఫైలుకు క్లియరెన్స్ మంజూరు చేసినట్లు సమాచారం అందింది.‌ వారంలోగా ప్రారంభించనున్న ప్రక్షాళనకు ముందుగా విజిలెన్స్ విభాగం నుండి క్రాస్ చెకింగ్ పేరుతో పరిశీలన రహస్యంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది.‌

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*