భారత్-పాక్ ఉద్రిక్తతలు బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన.

భారత్-పాక్ ఉద్రిక్తతలు బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన.

బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా సేవలందించాలని ఆదేశం

సైబర్ భద్రత సన్నద్దతపై బ్యాంకింగ్

ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి

భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు. ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ భద్రత సన్నద్ధతపై బ్యాంకులు, ఆర్బీఐ, ఎన్పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని, యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*