తిరుమల ఘాట్ రోడ్ లో దొర్లీపడ్డ కొండ చరియలు

తిరుమల ఘాట్ రోడ్ లో దొర్లీపడ్డ కొండ చరియలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను శనివారం రాత్రి మహాబలి పురం- కరైకల్ వద్ద తీరం దాటి.. బలహీనపడి తీవ్ర వాయు గుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక,కలియుగ వైకుంఠం తిరుమలలో శనివారం నుంచి వర్షం తెరిపి నివ్వడం లేదు.దీంతో ఆదివారం తెల్లవారు జామున రెండోఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండాసిబ్బంది ఎప్పటి కప్పుడు జేసీబీలతో బండ రాళ్లను తొలగిస్తున్నారు. గోగర్బం డ్యామ్ పూర్తిగా నిండి పోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలు తున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*