
మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తొలి విడతగా నైజీరియా(Nigeria) రాజధాని అబుజా చేరుకున్నారు. ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు..
దీంతో పాటు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. బాలికలు సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. భారత కమ్యూనిటీ ప్రజల శుభాకాంక్షలను ప్రధాని మోదీ స్వీకరించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన భారతీయ కమ్యూనిటీ ప్రజలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు..
Be the first to comment