
రాజానగరం నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన అన్నసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన అన్నసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు..
సీతానగరం మండలం కూనవరం గ్రామంలో శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించడం జరిగింది.. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో సచివాలయం 2 దగ్గర కార్తీక మాసం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు..
Be the first to comment