
నరసరావుపేట, పల్నాడు జిల్లా
–కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకిన నర్సింగ్ విద్యార్థి.
-హాస్పిటల్ నుంచి కోలుకొని తను సూసైడ్ చేసుకోవడానికి కారణాలు వెల్లడి.
-తను సూసైడ్ చేసుకోవడానికి కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది
కేరళ రాష్ట్రానికి చెందిన విస్మయ, వయసు 19సం బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం, నిన్న మధ్యాహ్నం సమయంలో తన కాలేజీలో టెర్రస్ మీద ఎవరు లేని సమయంలో సూసైడ్ ప్రయత్నం చేసింది. వెంటనే కాలేజీ సిబ్బంది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్లి ప్రధమ చికిత్స చేసి తదుపరి అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట లోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. వైద్యులు చికిత్స అనంతరం పేషెంట్ కు మెరుగైన వైద్యం అందించి పేషెంట్ ను స్టేబుల్ చేశారు. ఇప్పుడు పేషెంట్ కండిషన్ సాధారణ స్థితిలోకి వచ్చింది. పేషెంట్ నుంచి తీసుకున్న వాంగ్మూలం ప్రకారం పేషంట్ కి సైకలాజికల్ ప్రాబ్లం తో గత ఆరు నెలల నుంచి మెడిసిన్ వాడుతుంది. దాంతోపాటు తన మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ లో నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడంతో తనకు చదువు రాదని ఇక చదవలేనని తనకు తాను అనుకుంటూ మెంటల్గా డిస్టర్బ్ అయింది. అంతేకాకుండా గతంలో లవ్ ఎఫైర్ కూడా ఉండటంతో ఇంట్లోని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తను తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనిపించి అంజిరెడ్డి నర్సింగ్ కాలేజ్ ఐదవ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఈరోజు కోలుకొని అనంతటకు తానే వాంగ్మూలం ఇచ్చింది.
Be the first to comment