హైద‌రాబాద్‌లో దూసుకుపోతున్న రియ‌ల్ ఎస్టేట్

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రియల్ రంగానికి మరింత ఊతం అందించాయి. గత ఏడాదితో పోలిస్తే 2023 జులైలో ఆస్తి రిజిస్ట్రేషన్లు 26 శాతం పెరిగాయిని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్ అద్భుతమైన పెరుగుదలను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ కౌంట్‌ను వెల్లడించింది. దీంతో పాటు ఆస్తుల మొత్తం విలువ రూ. 2,878 కోట్లకు అంటే 35 శాతం పెరిగిందని తెలిపింది. మార్కెట్ ట్రెండ్‌లు గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలను సూచిస్తున్నాయి. జులైలో నమోదైన ఆస్తులలో 52 శాతం రూ. 25 – 50 లక్షల ధర పరిధిలోకి వెళ్లాయని, అత్యధిక రిజిస్ట్రేషన్ షేర్ ఉన్న పరిమాణం 1,000 – 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు మారిందని తెలిపింది. గృహాల కొనుగోలు 67 శాతం వాటాను కలిగి ఉందని విశ్లేషకులు తెలిపారు.

మేడ్చల్-మల్కాజిగిరి టాప్
రిజిస్ట్రేషన్ల డేటా మార్కెట్ స్థితిగతలను తెలియజేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో 2022లో క్షీణత నుంచి ఈ ఏడాది రీబౌండ్ అయిందని తెలుస్తోంది. కాంపాక్ట్ గృహాల కొనుగోలు (500-1,000 చదరపు అడుగులు) 18 శాతానికి పెరిగింది. 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా వృద్ధిని ప్రదర్శించాయి. జులై 2022లో 9 శాతం నుండి 2023 జులైలో 11 శాతానికి పెరిగాయి. జులై 2023లో జరిగిన మొత్తం గృహ విక్రయాల రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 46 శాతంతో అగ్రగామిగా ఉండగా, రంగారెడ్డి జిల్లా 37 శాతం, హైదరాబాద్ జిల్లా 17 శాతంతో ముందు వరుసలో ఉన్నాయి.

ఇళ్లకు ఎక్కువ డిమాండ్
1,000-2,000 చదరపు అడుగుల పరిధిలో బల్క్ లావాదేవీలు, రూ. 25 – 50 లక్షల ధరకు మించి కొంతమంది కొనుగోలుదారులు విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక హైలైట్ చేస్తుంది. దీంతో పాటు తరచుగా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విలువైన గృహాలు కొనుగోలు కూడా జరిగాయని తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ మంచి వృద్ధి సాధిస్తుందన్నారు. 1000 నుంచి 2000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు.

 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*