
నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
న్యూ ఢిల్లీ :
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రిలోపు ఏడుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషీ, సీఆర్ పాటిల్, జితేంద్రసింగ్, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవుతారు. ఏపీలో రక్షణ ఉత్పత్తులు, ఆర్థిక సాయం, ఏరో స్పేస్ హబ్ ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, పోలవరం, ఐటీ హబ్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నారు.
Be the first to comment