
16,18 బీజేపీ తిరంగా ర్యాలీలు
దేశ ఐక్యతను చాటేలా తిరంగా ర్యాలీలు నిర్వహించాలి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత సైనికుల వెంట జాతి యావత్తూ ఉందంటూ ఈ నెల 16, 18 తేదీల్లో ర్యాలీల నిర్వహణకు ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, శ్రేణులతో సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో పురందేశ్వరి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. ఇదే క్రమంలో స్వదేశీ ఆయుధాలు ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ప్రపంచానికి పరిచయమైన విషయాన్ని ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను వివరిస్తూ ఎన్డీఎ కూటమి నేతలు, స్వచ్చంద సంస్థలను ఆహ్వానించి
* *జిల్లా కేంద్రంలో 16న ర్యాలీలు నిర్వహించాలన్నారు*. అదేవిధంగా
* *18న అన్ని మండల కేంద్రాల్లో* *జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ* *ర్యాలీల* *నిర్వహణ* ద్వారా ఐక్యతను చాటాలని ఆమె పేర్కొన్నారు. తద్వారా భారత సైనికులకు, ప్రధాని మోదీ వెంట తామున్నమంటూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.
Be the first to comment