
గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసాల్లో అయిదో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రంథి శ్రీనివాస్ ఆఫీస్, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో ఏడు చోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు.
Be the first to comment